Pavan Sadineni : దుల్కర్ సల్మాన్, సాత్విక జంటగా తెరకెక్కిన ఆకాశంలో ఒక తార సినిమా రేపు నవంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని పవన్ సాధినేని డైరెక్ట్ చేసాడు. సావిత్రి, సేనాపతి సినిమాలతో మెప్పించిన పవన్ ఇప్పుడు ఈ భారీ సినిమాతో రాబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ సాధినేని మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
పవన్ సాధినేని మాట్లాడుతూ.. నా మొదటి సినిమా రిలీజయినప్పుడు నాకు 24 ఏళ్ళు. అప్పటికి నాకు అల్లు అర్జున్ తో పరిచయం కూడా లేదు. నా సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ నన్ను పిలిచి.. నీ సినిమా చూశాను. చాలా బాగుంది అన్నారు. అప్పట్నుంచి ఆయన నన్ను మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో.. నువ్వు వేరే స్థాయికి వెళ్లాలి. ఎక్కడో తప్పు చేస్తున్నావు చూసుకో అని సలహా ఇచ్చారు. అల్లు అర్జున్ కి కూడా నేను కొన్ని కథలు చెప్పాను. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గర ఉన్న కథలు కూడా నాకు అప్పుడప్పుడు వినిపించేవారు. సమయం కుదిరినప్పుడు, కథ సెట్ అయితే కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను అని తెలిపారు.

