Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కూడా హీరోగా వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నార్నె నితిన్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. దాంతో కొన్ని రోజుల క్రితమే నితిన్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత మొదటిసారి నార్నె నితిన్ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసారు.

ఈ ఫొటోలో నార్నె నితిన్ భుజానికి ఇంకా కొన్ని కట్లు, చేతికి సపోర్ట్ బ్యాగ్ తో కనపడ్డారు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో GTA గేమ్ ఫోటో, చేతిలో రిమోట్ ఉండటంతో GTA గేమ్ ఆడుతూ మధ్యలో ఇలా ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఫోటో షేర్ చేసి తిరిగి వస్తాను అని పోస్ట్ చేసారు.

Also Read : Vishwak Sen : ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్.. విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్..

ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం నార్నె నితిన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్ళీ షూటింగ్ కి వస్తారని తెలుస్తుంది. నార్నె నితిన్ ఆపరేషన్ తర్వాత ఫోటో షేర్ చేయడంతో త్వరగా కోలుకొని రావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Narne Nithiin (@narnenithiin)