ENE Repeat : తరుణ్ భాస్కర్ సూపర్ హిట్ సినిమా ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్ గా ENE రిపీట్ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. పార్ట్ 1 క్లాసిక్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్స్ నుంచే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని బాగా పండించడమే కాకుండా ఫుల్ లెంగ్త్ కామెడీతో నవ్వించారు.
యూత్ కి అయితే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మొదటి పార్ట్ కి మించి హిట్ అవ్వడం గ్యారెంటీ. ఈ నగరానికి ఏమైంది సినిమాతో తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ మరోసారి హిట్ కొట్టినట్టే. అయితే ఈ సినిమాలో అనేకమంది స్టార్స్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఈ గెస్ట్ అప్పీరెన్స్ లు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. స్టార్ డైరెక్టర్స్ సైతం అలా కనిపించి మెరిపించడంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.
Also See : Satvika Veeravalli : సినిమా రిలీజ్ కి ముందు.. దుల్కర్‌తో సాత్విక క్యూట్ ఫొటోలు.. ఆకాశంలో ఒక తార..
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమాలో క్లైమాక్స్ లో డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి, నందిని రెడ్డి గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి నవ్వించారు. సినిమా మొదట్లో OG డైరెక్టర్ సుజీత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించాడు. డైరెక్టర్ కరుణ్ కుమార్ ఎక్స్ టెండెడ్ క్యామియోలో ఉపేంద్ర పాత్ర తండ్రి పాత్రలో కనిపించారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ క్లైమాక్స్ లో మెరిపించాడు. ఇక డైరెక్టర్ అనుదీప్ కూడా ఫస్ట్ హాఫ్ లో అలా మెరిపించి నవ్వించాడు.
ఇంతమంది దర్శకులు గెస్ట్ అప్పీరెన్స్ లతో సినిమాపై తమకున్న ప్రేమని చాటుకున్నారు. వీళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, సింగర్ శ్రీరామచంద్ర కూడా ఎక్స్ టెండెడ్ క్యామియోలు చేసి మెప్పించారు. రాజీవ్ కనకాల గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఫుల్ గా నవ్విస్తుంది. విజయ్ దేవరకొండని కూడా గెస్ట్ గా ట్రై చేసారు కానీ కుదర్లేదు. సినిమా ఆరంభంలో విజయ్ వాయిస్ తో మాత్రం మెప్పించారు. మొత్తానికి ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా కంటెంట్ తో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను మెప్పించడమే కాక గెస్ట్ రోల్స్ తో కూడా అలరించింది.

