మెరుగైన జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలకు చెక్: ఉదయాన్నే ఇంగువ నీరు తాగడం వల్ల జీర్ణ రసాశయాలు ఉత్తేజితమవుతాయి. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధించడంతో పాటు, తిన్న ఆహారం తేలికగా అరిగేలా సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Hing Water

బరువు నియంత్రణకు సహకరిస్తుంది: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మరియు మెటబాలిజం వేగాన్ని పెంచడంలో ఇంగువ నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట ఈ పానీయాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

Hing Water

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్ వ్యాధులు, వివిధ ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.

Hing Water

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: ఇంగువ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Hing Water

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇంగువ ఆరోగ్యాకి ఎంతో మేలు చేసినప్పటికీ, దీనిని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా లేకుండా ఇంగువను తీసుకోకపోవడమే మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో దీనిని తమ దినచర్యలో చేర్చుకోవడం ఉత్తమం.