England vs Hong Kong: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లోనే అభిమానులకు భారీ వినోదం అందించింది. ఇంగ్లండ్ (England)తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అండ్ చైనా జట్టు బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఆరు ఓవర్లలోనే 149/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
హాంకాంగ్ బ్యాటర్ అన్షుమన్ ఈ ఇన్నింగ్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కేవలం 10 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన అతడు.. చివరకు 13 బంతుల్లో 62 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఇక బాబర్ హయత్ (Babar Hayat) కూడా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 15 బంతుల్లో 53 పరుగులు చేశాడు. నిజాకత్ ఖాన్ (Nizakat Khan) 8 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ అయితే మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. ఆ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6, 4, 6 బాదడంతో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. ఒక్క ఓవర్‌లోనే బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించడంతో హాంకాంగ్ స్కోరు ఒక్కసారిగా భారీగా పెరిగింది.
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు హాంకాంగ్ బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరు ఓవర్లలో ఇంగ్లండ్ 88/3 పరుగులకే పరిమితమైంది. దీంతో హాంకాంగ్ అండ్ చైనా 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. హాంకాంగ్ సిక్సెస్‌లో తొలి రోజే ఇలాంటి విధ్వంసక బ్యాటింగ్ కనిపించడంతో టోర్నీపై ఆసక్తి మరింత పెరిగింది.

