కడుపు క్యాన్సర్ ప్రారంభ దశలో ఎక్కువగా లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదురే సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయంట. కాగా, అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఏ సమయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిదో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఎప్పుడూ తీవ్రమైన కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే చాలా వరకు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Cancer 2

ముఖ్యంగా కడుపు క్యాన్సర్ ఉంటే, చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు అధికంగా ఉంటాయంట. చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తర్వాత ఇదే క్యాన్సర్‌గా మారి ప్రాణానికే ముప్పు తీసుకొస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువలన చాలా కాలంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యతో బాధపడితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

Cancer 3

అంతే కాకుండా బరువు తగ్గడం, ఏ కారణం లేకుండా వివరించలేని విధంగా బరువు తగ్గడం. ఆకలి పూర్తిగా తగ్గిపోవడం, కొంచెం తినగానే కడుపు నిండి పోవడం వంటి సమస్యలు కనిపిస్తే అస్సలే నిర్లక్ష్యం చేయకూడదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. వీటిని లైట్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట.

Cancer 4

కొందరు కడుపు నొప్పిని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ నిరంతరం కడుపులో విపరీతమైన నొప్పి, బిగుసకపోయినట్లు అనిపించడం, కనీసం వారంలో ఒక్కసారి అయినా నొప్పి రావడం వంటి ఇబ్బందులు ఎదురు అవుతే తప్పకుండా వైద్య నిపుణుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Cancer 5

ఇవే కాకుండా ఎప్పుడూ అలసట, నీరసం, ఏ పని చేయలేకపోవడం. వాంతులు , మలబద్ధకం, మలం పూర్తిగా నలుపు రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురు అవ్వడం, ఆహారం తీసుకుంటే సరిగ్గా మిగలేకపోవడం, కడుపులో నొప్పి, రక్త హీనత వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఒకసారి వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా మంచిది. ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం వలన ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోవచ్చునంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.