OnePlus Ace 7 Pro Launched: వన్‌ప్లస్ (OnePlus) ప్రీమియం పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 7 Proను చైనాలో విడుదల చేసింది. స్టాండర్డ్ Ace 7తో పోలిస్తే మరింత శక్తివంతమైన ప్రాసెసర్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, అధునాతన వీడియో ఫీచర్లను ఇందులో అందించారు. భారీ 9000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 185Hz గేమింగ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

185Hz డిస్‌ప్లే & ప్రాసెసర్

OnePlus Ace 7 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది సాధారణ వినియోగంలో 165Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండగా.. అనుకూలమైన గేమ్స్‌లో 185Hz వరకు పెరుగుతుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్, హార్డ్‌వేర్ స్థాయి లో-బ్లూ-లైట్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఫోన్‌కు 3nm టెక్నాలజీపై తయారైన Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ పవర్ అందిస్తుంది. Adreno 840 GPUతో ఉన్న ఈ చిప్‌సెట్‌కు 12GB, 16GB LPDDR5X ర్యాం ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ 256GB నుంచి 1TB వరకు UFS 4.1లో లభిస్తుంది. ఇంకా మొబైల్ లో గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్-ఛానల్ “ఐస్ రివర్” యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. గేమింగ్ సమయంలో టచ్ రెస్పాన్స్, గైరోస్కోప్, నెట్‌వర్క్ పనితీరు, ఫ్రేమ్ స్టెబిలిటీని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చిప్‌లను కూడా అందించారు.

200MP కెమెరా..

ఫొటోగ్రఫీ విభాగంలో Ace 7 Pro ప్రత్యేకంగా నిలవనుంది. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్ కెమెరా 3.5x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో పోర్ట్రెయిట్, దూరంలోని వస్తువులను ఫొటో తీయడంలో మంచి ఫలితాలు పొందవచ్చు. వీడియో రికార్డింగ్‌లోనూ ప్రో మోడల్ అధునాతన ఫీచర్లను అందిస్తుంది. 120fps వరకు 4K వీడియో, 30fps వద్ద 8K వీడియో, 4K అల్ట్రా-హై-డెఫినిషన్ లైవ్ ఫొటో రికార్డింగ్, కలర్ గ్రేడింగ్ కోసం ప్రత్యేక Log ప్రొఫైల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

9000mAh బ్యాటరీతో 100W ఛార్జింగ్

ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్లో 9000mAh గ్లేసియర్ బ్యాటరీని అందించారు. దీనికి 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పవర్ బైపాస్ టెక్నాలజీతో గేమింగ్ సమయంలో ఛార్జర్ నుంచి నేరుగా ఫోన్‌కు పవర్ అందేలా చేస్తుంది. దీంతో ఎక్కువసేపు గేమింగ్ చేసినప్పుడు బ్యాటరీపై వేడి, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో పాటు కంపోజిట్ గ్లాస్ బ్యాక్‌ను ఉపయోగించారు. 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ అందించారు. సిమెట్రికల్ స్టీరియో డ్యూయల్ స్పీకర్లు, X-axis లీనియర్ వైబ్రేషన్ మోటార్ కూడా ఉన్నాయి.

ధర

చైనాలో 12GB + 256GB వేరియంట్ ధర 4,799 యువాన్లు (USD 720 / రూ.68,570)గా ఉంది. 16GB + 256GB ధర 5,299 యువాన్లు (USD 795 / రూ.75,715) కాగా, 12GB + 512GB ధర 5,599 యువాన్లు (USD 839 / రూ.80,005), 16GB + 512GB ధర 5,999 యువాన్లు (USD 899 / రూ.85,720)గా ఉంది. టాప్ ఎండ్ 16GB + 1TB వేరియంట్ ధర 7,299 యువాన్లు (USD 1,095 / రూ.1,04,295)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.