Shreyas Iyer Captaincy Records: క్రికెట్‌లో టాస్ గెలవడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశాల్లో ఒకటి. ముఖ్యంగా పిచ్ పరిస్థితులు, వాతావరణం, జట్టు వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు.

Ind Vs Nz Shreyas Iyer Toss Stats

తన కెప్టెన్సీలో ఆడిన తొలి 25 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 19 సార్లు టాస్ గెలిచాడు. దీంతో తొలి 25 మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Ind Vs Nz Shreyas Iyer Toss Records

ఈ జాబితాలో వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ తమ తొలి 25 మ్యాచ్‌ల్లో 17 చొప్పున టాస్‌లు గెలిచారు. అయితే 19 టాస్ విజయాలతో శ్రేయస్ అయ్యర్ వీరిద్దరినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

Shreyas Iyer Toss Records (1)

తొలి 25 మ్యాచ్‌ల్లోనే ఈ స్థాయి టాస్ విజయాలు సాధించడం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానంలో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. అయితే, మ్యా్చ్‌లు గెలవడంలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు గెలవగా, కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయాడు. ఇందులో 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

Shreyas Iyer Toss Records

ఇక కివీస్ సిరీస్ గురించి మాట్లాడితే, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3 మ్యాచ్‌లు గెలిచిన శ్రేయాస్ సేన ప్రస్తుతం 4వ మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్, క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాడు.