లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలకు ఇటీవల బ్రేక్ పడింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం, ఆ తర్వాత ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేయడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై నయన్ కూడా సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ తాజాగా ఆమె మరోసారి తన పాత పద్ధతినే కొనసాగించారు. ‘మూకుత్తి అమ్మన్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టారు.
కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ ఒకటి. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెజీనా కసాండ్రా ప్రతినాయకురాలిగా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో జోరుగా సాగడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయనతార కూడా హాజరు కాకపోవడంతో కార్యక్రమం అంతంతమాత్రంగానే సాగింది.
మూకుత్తి అమ్మన్ 2కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న నయనతార.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎందుకు రాలేదని అభిమానులు చర్చిస్తున్నారు. అయితే నయనతార ఈవెంట్‌కు రాకపోవడానికి గల కారణాన్ని చిత్ర బృందం వెల్లడించింది. షూటింగ్ బిజీ కారణంగా ఆమె హాజరు కాలేకపోయారని తెలిపింది. సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార నాన్‌వెజ్‌కు దూరంగా ఉన్నారని దర్శకుడు సుందర్ వెల్లడించారు. పాత్ర పట్ల, సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

