Moto Watch 2 Fit: మోటరోలా (Motorola) నుండి మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకోవచ్చు. Moto Watch 2 Fit పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆకట్టుకునే డిజైన్‌తో పాటు అధునాతన హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను అందించింది. ముఖ్యంగా ఇందులో 1.85 అంగుళాల gOLED డిస్ప్లే, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, 12 రోజుల బ్యాటరీ లైఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫిట్నెస్ టెక్నాలజీ సంస్థ పోలార్ (Polar) రూపొందించిన అల్గారిథమ్ లను కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల gOLED ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అందించారు. ఇది 1,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్‌పై సమాచారాన్ని స్పష్టంగా చూసుకోవచ్చు. డిస్ప్లే రక్షణ కోసం “కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3″ను ఉపయోగించారు. కేవలం 2mm బెజెల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను అందించారు. అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ వాచ్‌కు బ్రీతబుల్ సిలికాన్ స్ట్రాప్ ఇచ్చారు. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 5ATM వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. దీంతో స్విమ్మింగ్ వంటి కార్యకలాపాల సమయంలోనూ ఉపయోగించుకోవచ్చు.
ఈ వాచ్‌లో “పోలార్” ఫిట్నెస్ అల్గారిథమ్‌లను ప్రత్యేకంగా అందించారు. వీటి ద్వారా వినియోగదారులు తమ వ్యాయామ సామర్థ్యం, శారీరక శ్రమ, రికవరీ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో “రన్నింగ్ ఇండెక్స్” ఫీచర్ ద్వారా గుండె స్పందన ఆధారంగా రన్నింగ్ సామర్థ్యాన్ని విశ్లేషించవచ్చు. “ఎనర్జీ సోర్సెస్” ఫీచర్ ద్వారా వ్యాయామ సమయంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల నుంచి ఎంత శక్తి వినియోగించారో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా “స్లీప్ ప్లస్ స్టేజెస్” ద్వారా నిద్ర దశలను, నైట్లీ రీఛార్జ్ ద్వారా శరీర రికవరీ స్థాయిని అంచనా వేయవచ్చు. “సెరెనా” ఫీచర్ ద్వారా గైడెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు. నిరంతర హార్ట్‌రేట్ మానిటరింగ్, SpO2, స్ట్రెస్ ట్రాకింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.
ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం ఈ స్మార్ట్‌వాచ్‌లో 100కు పైగా యాక్టివిటీలను ఆటోమేటిక్‌గా గుర్తించే సామర్థ్యం ఉంది. ఇందులోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS ద్వారా అవుట్డోర్ వర్కౌట్స్ సమయంలో లొకేషన్, ప్రయాణించిన మార్గాన్ని మరింత కచ్చితంగా ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయంలోనూ మోటో వాచ్ 2 ఫిట్ ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో గరిష్ఠంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా వాచ్ నుంచే నేరుగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. త్వరలో మోటోరోలా Qira వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కనెక్ట్ చేసిన మోటరోలా స్మార్ట్‌ఫోన్‌తో వాయిస్ కమాండ్స్ ద్వారా సంభాషించవచ్చు.
Moto Watch 2 Fit స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధరను 119 యూరోలుగా (సుమారు రూ.12,620) నిర్ణయించారు. అలాగే 100 బ్రిటిష్ పౌండ్ల ధరకు కూడా అందుబాటులోకి రానుంది. పాంటోన్ స్ట్రాటిఫైడ్ సీ, పాంటోన్ పిజియన్, పాంటోన్ బ్యాలెరినా అనే మూడు రంగుల్లో విడుదల చేయనున్నారు. రాబోయే వారాల్లో యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో లాంచ్ తేదీ, ధరపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

