Sai Durgha Tej : ఇన్నాళ్లు సోలో బతుకే సో బెటర్ అని తిరిగేసిన మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తాజాగా నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి రెడీ అయ్యాడు. సాయి దుర్గా తేజ్ తన చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్మయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా కజిన్స్, పలువురు సాయి తేజ్ క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. రామ్ చరణ్ తో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ నిశ్చితార్థం నుంచి స్పెషల్ ఫోటో షేర్ చేసి సాయి దుర్గా తేజ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : RC 17 : వామ్మో.. చరణ్ – సుకుమార్ సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా..?
ఈ ఫొటోలో సాయి దుర్గా తేజ్, కిరణ్మయి నిశ్చితార్థపు పూల దండాలు వేసుకొని కూర్చోగా చుట్టూ మెగా కజిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్, అకిరా నందన్, స్నేహ రెడ్డి, అల్లు బాబీ, అల్లు శిరీష్, నయానిక, నిహారిక, వైష్ణవ్ తేజ్, ఆద్య, సుస్మిత, శ్రీజ.. పలువురు ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత మెగా కజిన్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సాయి దుర్గ తేజ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever https://t.co/eJ7g9I5S2X— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2026


