100 గ్రాముల ఎర్ర బియ్యంలో 356 క్యాలరీల శక్తి, 75.5 గ్రాముల పిండి పదార్థాలు, 9 గ్రాముల మాంసకృతులు, 3 గ్రాముల కొవ్వులు మరియు అత్యధికంగా 11 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. తెల్ల బియ్యం కంటే మూడు నుండి నాలుగు రెట్లు అధిక పీచు పదార్థం ఇందులో లభిస్తుంది, బ్రౌన్ రైస్ కంటే కూడా ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.

ఎర్ర బియ్యానికి ఆ రంగు రావడానికి కారణం ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఆంథోసైనిన్స్ మరియు ఫినాల్స్ వంటివి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. ఇందులో ఉండే ఫినాల్స్, ఆంథోసైనిన్స్ పిండి పదార్థాలు త్వరగా గ్లూకోజ్‌గా మారకుండా అడ్డుకుంటాయి. అలాగే, 11 గ్రాముల పీచు పదార్థం గ్లూకోజ్‌ను రక్తంలోకి నెమ్మదిగా శోషించేలా స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుంది. ఇది బరువు త్వరగా పెరగకుండా, షుగర్ వ్యాధి రాకుండా నివారిస్తుంది. హెరిడిటరీగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారికి ఇది భవిష్యత్తులో షుగర్ రాకుండా కాపాడటానికి సైంటిఫిక్‌గా నిరూపించారు.

ఎర్ర బియ్యం త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి, షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది.ఎర్ర బియ్యంలో 9,12-ఆక్టాడెకాడినోయిక్ యాసిడ్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది, ఇది కార్టిలేజ్ టిష్యూను (ముఖ్యంగా మోకాళ్ల వద్ద ఉండే కార్టిలేజ్) దెబ్బతినకుండా రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

అధిక పీచు పదార్థం ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్‌ను ప్రేగుల నుండి రక్తంలోకి శోషించబడకుండా నిరోధించి, శరీరం నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.స్థూలకాయం, అధిక బరువు, షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలున్నవారు అన్నాన్ని పూర్తిగా మానేసి పుల్కా, అధిక కూరగాయలు తినడం ఉత్తమం

చంటి పిల్లలకు, ముసలి వారికి, గర్భిణులకు, బాలింతలకు తెల్ల బియ్యానికి బదులుగా ఎర్ర బియ్యం (4-8 గంటలు నానబెట్టి) ఇవ్వడం చాలా మంచిదని అంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ నియంత్రించుకోవాలనుకునేవారు అన్నం తినాలని అనిపించినప్పుడు, తక్కువ మోతాదులో ఎర్ర బియ్యం అన్నం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

