IPL 2027 Retention Deadline: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ (BCCI) స్వల్ప ఊరటనిచ్చింది. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణ గడువును రెండు రోజులు పొడిగించినట్లు క్రిక్‌బజ్ (Cricbuzz) తాజా నివేదిక చెబుతోంది. ఇప్పుడు నవంబర్ 17 వరకు ఫ్రాంచైజీలకు సమయం ఉంటుంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలనే నిర్ణయాలను అప్పటిలోగా తీసుకోవాలి.

గడువు ఎందుకు పొడిగించారు?

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. సిరీస్‌లోని ఐదో, చివరి వన్డే నవంబర్ 15న మౌంట్ మౌంగానుయ్‌లోని బే ఓవల్‌లో జరగనుంది. దీంతో ఫ్రాంచైజీలకు చర్చలు పూర్తి చేసి, తమ జట్టు ప్రణాళికలను ఖరారు చేసుకోవడానికి అదనపు సమయం దక్కింది.

ఎక్కువమంది చదివినది: IND vs SL: అభిమానులకు బిగ్ షాక్.. అక్కడ రోహిత్, కోహ్లీ ఆటను చూసే ఛాన్స్ లేనట్టే.. ఎందుకంటే..?

ఈ 48 గంటల వ్యవధిలో టీమ్ మేనేజ్‌మెంట్లు తమ ప్రస్తుత కాంబినేషన్లను అంచనా వేసుకోవచ్చు. ఎవరిని కొనసాగించాలి, ఎవరిని వేలం పూల్‌లోకి విడుదల చేయాలనే విషయంలో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

వేలం తేదీ, వేదికలో మార్పు లేదు

రిటెన్షన్ గడువు మారినా, ఐపీఎల్ 2027 మినీ వేలం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు. ఫ్రాంచైజీలకు పంపిన తాజా సమాచారం ప్రకారం, ఈ వేలం డిసెంబర్ 16న గోవాలో జరుగుతుంది.

అదే రోజు మరో అంతర్జాతీయ మ్యాచ్ ఉన్నా, బీసీసీఐ అసలు వేలం తేదీనే కొనసాగిస్తోంది. భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే డిసెంబర్ 16న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

ఎక్కువమంది చదివినది: W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!

ప్రస్తుతానికి ఫ్రాంచైజీలన్నీ నవంబర్ 17లోపు తుది రిటెన్షన్ జాబితాలు సమర్పించాలి. ఆ తర్వాత ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..