Rohit Sharma Records: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బాట్స్మెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో రికార్డులను సృష్టించి, మరెన్నో రికార్డులను బద్దలు కొట్టారు. రేపటి (నవంబర్ 4)నుండి న్యూజిలాండ్‌తో మొదలుకానున్న వన్డే సిరీస్‌లోనూ హిట్ మ్యాన్ భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ కు పలు అరుదైన ఘనతలు సాధించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఒక్కో మైలురాయిని చేరుకుంటే రోహిత్ ఖాతాలో అనేక రికార్డులు చేరనున్నాయి. మరి ఆ రికార్డులేంటి..? వాటికీ ఎంత దూరంలో ఉన్నదో చూసేద్దామా..
రోహిత్ సాధించగల రికార్డులు ఇవే..
* ఈ సిరీస్‌లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిస్తే 39 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలుస్తారు.
* మరో 183 పరుగులు సాధిస్తే విజయవంతమైన మ్యాచ్‌ల్లో 15,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తారు.
* ఈ సిరీస్‌లో ఒక సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై వన్డేల్లో శతకం బాదిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తారు.
* ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా నిలుస్తారు.
* సెంచరీ సాధిస్తే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాలన్నింటిలో వన్డే శతకాలు చేసిన నాలుగో భారతీయుడిగా గుర్తింపు పొందుతారు.
* మరో 36 పరుగులు చేస్తే సెనా దేశాల్లో 5,000 వన్డే పరుగులు చేసిన తొలి భారత ఓపెనర్‌గా నిలుస్తారు.
* మరో రెండు సిక్సర్లు బాదితే న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తారు.
* 5 సిక్సర్లు కొడితే న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తారు.
* 6 సిక్సర్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు బాదిన తొలి ఓపెనర్‌గా నిలుస్తారు.
* 8 సిక్సర్లు కొడితే సెనా జట్లపై 200 సిక్సర్లు బాదిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పుతారు.
* మరో 14 సిక్సర్లు బాదితే సెనా దేశాల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన విదేశీ ఆటగాడిగా నిలుస్తారు.
న్యూజిలాండ్ గడ్డపై రోహిత్ రికార్డ్స్
ఈ రికార్డులన్నీ సాధించడం రోహిత్ శర్మకు అంత సులభమేమి కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ గడ్డపై అతడి వన్డే రికార్డు ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు అక్కడ ఒక్క వన్డే సెంచరీ కూడా చేయలేకపోయాడు. న్యూజిలాండ్‌లో 13 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 36.4 సగటుతో 437 పరుగులు చేయగలిగాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. మరి ఈ పర్యటనలోనైనా అక్కడ తొలి సెంచరీ సాధించి రోహిత్ తన పేరిట ఎన్ని రికార్డులు లిఖించుకుంటారో చూడాలి.

