కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ వచ్చారు. నవంబర్ 2వ తేదీ (సోమవారం) ఆయన భాగ్యనగరంలో ఉన్నారు. ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మర్యాదపూర్వకంగా కలిశారు. వారి మధ్య ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగం, డీప్ ఫేక్ వీడియోల గురించి డిస్కషన్ జరిగింది. అమిత్ షాకు మెగాస్టార్ ఓ రిక్వెస్ట్ చేశారు.

డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేయండి - చిరు విజ్ఞప్తి
హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు, కళాకారులను లక్ష్యంగా చేసుకుని కొందరు అసభ్యకర, మార్ఫింగ్ చేసిన దారుణమైన వీడియోలను రూపొందిస్తున్నారని అమిత్ షాకు చిరంజీవి వివరించారు. ఇటీవల ఈ ధోరణిపై ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన చిరంజీవి... అమిత్ షాతో జరిగిన భేటీలో మరో కీలక అడుగు వేశారు. కేంద్ర హోంశాఖ మంత్రికి ఏఐ దుర్వినియోగం, డీప్‌ ఫేక్ వీడియోల వల్ల వచ్చే సమస్యలను వివరించారు.

Also Read: Nayanthara Simbu - మాజీ ప్రేమికులు మళ్ళీ కలుస్తారా? శింబుతో నయనతార సినిమా చేస్తారా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం (AI Misuse) చేస్తున్న తీరును అమిత్ షాకు వివరించేందుకు చిరంజీవి అపాయింట్‌మెంట్ కోరారు. ఏఐను తప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలకు వాడటం వల్ల కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని అమిత్ షాకు ఆయన తెలిపారు. సోషల్ మీడియాకు మాత్రమే ఈ సమస్యను పరిమితం చేయకుండా... చిత్రసీమ తరఫున ఇటువంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఏఐని దుర్వినియోగం చేసేవాళ్ళకు కఠినమైన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు.

Also Read: Shivathmika Rajashekar - థాయ్‌లాండ్‌లో శివాత్మిక... ENE 2 డైరీస్ షేర్ చేసిన రాజశేఖర్ కూతురు

చిరంజీవి చెప్పిన విషయాలను, ఆయన వ్యక్తం చేసిన ఆందోళనను సానుకూలంగా అర్థం చేసుకున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా... కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని చిరంజీవికి ఆయన సూచించారు. అంతే కాదు... ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అప్పగించారు. ఆయన చూపించిన చొరవ, స్పందనకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో డీప్ ఫేక్ వీడియో సమస్యకు  పరిష్కారం లభించి, కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Keerthy Suresh Akka Web Series Review In Telugu - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్