BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) వినియోగదారుల కోసం సరికొత్త చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.51 ధరతో లభించే ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ పాత వినియోగదారులకు అందుబాటులో ఉండదు. కొత్తగా BSNL కనెక్షన్‌ తీసుకునే వారు మాత్రమే ఈ ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌ (FRC)ను ఉపయోగించుకోవచ్చు.

రూ.51 ప్లాన్‌ ప్రయోజనాలు

ఈ ప్లాన్‌ ద్వారా మొత్తం 56GB డేటా లభిస్తుంది. రోజుకు 2GB హైస్పీడ్‌ డేటా వినియోగించుకోవచ్చు. అలాగే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSల ప్రయోజనాలు ఉంటాయి. అంటే రోజుకు సగటున కేవలం రూ.1.82 ఖర్చుతో ఈ సేవలను పొందవచ్చు. ఈ ఆఫర్‌ అన్ని టెలికాం సర్కిళ్లలో కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రూ.1కే ప్లాన్‌

BSNL కొత్త వినియోగదారుల కోసం రూ.1 ధరతో మరో ఫస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు లభిస్తాయి. మొత్తంగా 24GB డేటా పొందవచ్చు. రోజుకు సగటున దాదాపు 4 పైసల ఖర్చుతో ఈ ప్రయోజనాలు అందుతాయి.

రూ.107 ప్లాన్‌

ఇక BSNL అందిస్తున్న మరో ప్లాన్‌ రూ.107తో అందుబాటులో ఉంది. ఇందులో 20 రోజుల సర్వీస్‌ వ్యాలిడిటీతో పాటు 3GB డేటా, 200 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి.

తక్కువ ధరలోనే రీఛార్జ్‌ ప్లాన్లను అందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను తన 4G నెట్‌వర్క్‌ వైపు ఆకర్షించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కొత్తగా BSNLకు మారాలనుకునే వారికి రూ.51, రూ.1 ఫస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్లు తక్కువ ఖర్చుతో సేవలను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.