TG Church Grant Application: క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పండుగ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి రిజిస్టర్డ్ చర్చికి రూ. 30,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిధులు దేనికోసం అంటే?
క్రిస్మస్ పండుగకు ముందు చర్చిల ప్రాంగణాల సుందరీకరణకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యంగా చర్చిలకు వైట్వాషింగ్, అలాగే పండుగ శోభను తెచ్చే విధంగా డెకరేటివ్ ఎలక్ట్రికల్ లైటింగ్ పనుల నిమిత్తం రూ. 30,000 నిధులను వినియోగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని రిజిస్టర్డ్ చర్చిలకు ఈ పండుగ సాయం వర్తించనుంది.
Also Read:
ఆన్లైన్ దరఖాస్తులు, ముఖ్య తేదీలు
చర్చిలు ఆర్థిక సాయం పొందేందుకు అర్హత కలిగిన నిర్వాహకులు నిర్దేశిత గడువులోగా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తులు: నవంబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు
- దరఖాస్తు పోర్టల్: TG OBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
నియోజకవర్గాల వారీగా కోటా కేటాయింపు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అర్హత కలిగిన చర్చిలకు ఈ ఆర్థిక సాయం సమానంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అర్హత కలిగిన చర్చిల కోటాను కేటాయిస్తాయి. దీంతోరాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలకు ఈ నిధులు సక్రమంగా అందుతాయి. క్రిస్మస్ వేడుకలకు ప్రభుత్వం పండుగ సాయం ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్

