Realme 17 PRO: రియల్‌మీ (Realme) తన నంబర్డ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే Realme 17T 5G ఫోన్‌కు సంబంధించిన వివరాలు బయటకు రాగా.. తాజాగా Realme 17 Pro స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. లీక్‌ల ప్రకారం Realme 17 Proలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ అందించనున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నట్లు టాక్. సెల్ఫీల కోసం 32MP లేదా 50MP ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉంది. అయితే ఫ్రంట్ కెమెరాతో 4K రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చని లీకైన వివరాలు సూచిస్తున్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉండనున్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17తో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఒప్పో, రియల్‌మీ సంస్థల మధ్య జరిగిన మార్పుల నేపథ్యంలో Realme UIకి బదులుగా ColorOS అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ సిరీస్‌లోని హైఎండ్ మోడల్ రియల్‌మీ 17 ప్రో+కు సంబంధించిన వివరాలు కూడా గతంలో లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ‘ప్రో’ మోడల్‌తో పోలిస్తే ‘ప్రో+’లో మరింత శక్తివంతమైన ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు, విడుదల తేదీ, ధరపై రియల్‌మీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.