హైదరాబాద్‌, అక్టోబర్ 30: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ కోర్సులో శిక్షణ అందించనున్నట్లు ఫౌండేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ సి. రాఘవేందర్‌రావు తెలిపారు. సెంటర్‌ ఫర్‌ ఫ్యూచర్‌ రెడీ స్కిల్లింగ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ (సీఎఫ్‌ఆర్‌ఎస్‌ఐ) కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఐటీఐలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్‌ లేదా ఇతర ట్రేడ్స్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితో పాటు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, ఫార్మా, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ (ఎంఎల్‌టీ), ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ యువత కూడా అర్హులని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎన్‌సీవీఈటీ గుర్తింపు పొందిన ఈ కోర్సులో మూడు నెలల పాటు శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఫౌండేషన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. శిక్షణ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఫార్మా రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి పొందాలనుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు:

  • 8019050334
  • 9100131017
  • 8886771981
  • 9247573293