WPL 2027 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది. జనవరి 14, 2027 నుండి ఫిబ్రవరి 7, 2027 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబై రెండు నగరాలు సంయుక్తంగా ఈ సీజన్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌ల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. దీనితో మొదటి మ్యాచ్ తోనే ప్రేక్షకులు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 మజ్ను ఎంజాయ్ చేయనున్నారు.
గత సీజన్లో నవీ ముంబై, వడోదరలు ఆతిథ్యమివ్వగా.. ఈసారి నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో వేదికను ముంబైకి మార్చారు. తాజా సీజన్లో ఒక్కో నగరంలో 11 మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జనవరి 14 నుండి 24 తేదీలలో వడోదరలోని కోటాంబి స్టేడియంలో మొదటి 11 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది గుజరాత్ జెయింట్స్ జట్టుకు హోమ్ గ్రౌండ్‌గా వ్యవహరించనుంది. ఆ తర్వాత ఒక రోజు విరామం తర్వాత ముంబైలోని ప్రఖ్యాత బ్రబౌర్న్ స్టేడియం (CCI)కి టోర్నీ మారుతుంది. ఇక్కడ జనవరి 26 నుండి ఫిబ్రవరి 7 వరకు 9 లీగ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్ ఫిబ్రవరి 5న, గ్రాండ్ ఫైనల్ ఫిబ్రవరి 7న మ్యాచ్ లు జరగనున్నాయి. ఇది ముంబై ఇండియన్స్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇటీవల ముగిసిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ను యూపీ వారియర్స్ రూ. 1.1 కోట్లకు దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిపింది. భారత ప్లేయర్లలో కిరణ్ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. టోర్నీ ముగింపు దశ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్‌తో (ఫిబ్రవరి 1-5) క్లాష్ కానుంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (MI), లారెన్ బెల్ (RCB), సోఫీ ఎక్లెస్టోన్ (యూపీ వారియర్స్) వంటి సీనియర్ ప్లేయర్లు WPL చివరి దశ మ్యాచ్‌లలో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతించింది. అంతేకాకుండా.. ఈ టోర్నమెంట్ ముగిసిన వారం రోజులకే ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఆరు జట్ల తొలి విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇదే రెండు స్టేడియాల్లో జరగనుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 పూర్తి షెడ్యూల్
వడోదర లెగ్ (కోటాంబి స్టేడియం):
* జనవరి 14: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (వడోదర)
* జనవరి 15: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (వడోదర)
* జనవరి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (వడోదర)
* జనవరి 17: యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
* జనవరి 18: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వడోదర)
* జనవరి 19: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (వడోదర)
* జనవరి 20: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
* జనవరి 21: యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వడోదర)
* జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (వడోదర)
* జనవరి 23: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
* జనవరి 24: యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (వడోదర)
ముంబై లెగ్ (బ్రబౌర్న్ స్టేడియం – CCI):
* జనవరి 26: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
* జనవరి 27: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ముంబై)
* జనవరి 28: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (ముంబై)
* జనవరి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
* జనవరి 30: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ముంబై)
* జనవరి 31: యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
* ఫిబ్రవరి 1: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
* ఫిబ్రవరి 2: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (ముంబై)
* ఫిబ్రవరి 3: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ముంబై)
ప్లేఆఫ్స్ (ముంబై):
* ఫిబ్రవరి 5: ఎలిమినేటర్ (ముంబై).
* ఫిబ్రవరి 7: గ్రాండ్ ఫైనల్ (ముంబై).
Mark your calendars, folks
#TATAWPL 2027 fixtures are out with defending champions @RCBTweets and @mipaltan kicking things off in Vadodara
![]()
Which match are you looking forward to the most?
https://t.co/plbt6PLPFj
— Women’s Premier League (WPL) (@wplt20) November 4, 2026


Mark your calendars, folks 
https://t.co/plbt6PLPFj