ముందుగా రెండు మొక్కజొన్న పొత్తులను తీసుకోండి. వీటిని గింజలు వలవాల్సిన అవసరం లేదు. ఒక గరిటెతో మొక్కజొన్న గింజలను నేరుగా పొత్తు నుండి కట్ చేయండి. ఇలా చేయడం వల్ల నూనెలో వేయించేటప్పుడు గింజలు చిట్లకుండా ఉంటాయి. అన్ని గింజలను ఒక గిన్నెలోకి తీసుకోండి.

ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే వేపని పల్లీలను వేసి, పల్స్ మోడ్‌లో ఒకటి రెండు సార్లు తిప్పాలి పల్లీలు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలా చూసుకోండి. ఇలా ఉండటం వల్ల పకోడి తినేటప్పుడు మంచి రుచి ఉంటుంది.

గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్‌ను మొక్కజొన్న గింజలు ఉన్న గిన్నెలోకి కలపండి. ఇందులోకి జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకును వేయండి. బైండింగ్ కోసం శెనగపిండి, బియ్యప్పిండిని కూడా కలపండి.అన్ని పదార్థాలను చేతితో బాగా కలపండి. మొదట కొంచెం ప్రెస్ చేస్తూ రెండు నిమిషాలు కలపండి. మొక్కజొన్నలో సహజంగా నీళ్లు ఊరుతాయి కాబట్టి, పిండిని కలిపేటప్పుడు తక్కువ నీటిని ఉపయోగించాలి.

ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్లు మాత్రమే చల్లుకుంటూ, పిండిని ముద్దలా కట్టేంత వరకు కలపండి. పిండి గట్టిగా, ముద్దలా పట్టుకుంటే విడిపోకుండా ఉంటుంది. ఒకవేళ బైండింగ్ సరిపోకపోతే, కొద్దిగా బియ్యప్పిండి లేదా శెనగపిండిని చేర్చుకోవచ్చు. మరో పక్క డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయండి. నూనె చక్కగా వేడయ్యాక, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి.

పిండి మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకుని, చిన్న చిన్న ఉండలుగా లేదా మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని వేడి నూనెలో వేయండి. నూనెలో సరిపడా పకోడిలను వేసిన తర్వాత, వెంటనే కదపకుండా రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. పకోడిలు కొద్దిగా గట్టిపడిన తర్వాత, నెమ్మదిగా కదుపుతూ, అన్ని వైపులా సమానంగా వేగేలా చూసుకోండి. బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించండి. జాలిగరిటతో తీసి, అదనపు నూనెను వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.

