Telangana IAS Transfers | హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్, నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ, కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నవంబర్ 28న జీవో జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా పట్టణాభివృద్ధి, మెట్రో రైలు, మున్సిపల్ పరిపాలన రంగాలలో కీలక మార్పులు జరిగాయి.
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ పరిధి) ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. వీటితో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గానూ ఆయనను నియమించారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఈ.వి. నర్సింహా రెడ్డిని హెచ్ఎండీఏ నూతన మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. అలాగే ఆయనకు మూసీ ప్రాజెక్ట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ పోస్టులో ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. మరోవైపు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్-కలెక్టర్‌గా ఉన్న ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
జలమండలి (HMWS&SB) జేఎండీ మయాంక్ మిట్టల్ )కు జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన కె. చంద్రకళకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్ & మెట్రో రైల్) బాధ్యతలు ఇచ్చారు. దానికి అదనంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
విద్యాశాఖలోనూ బదిలీలు జరిగాయి. వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి. రామును విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా బదిలీ చేశారు. ఇప్పటివరకు విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న వి. శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి, తన మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

1. సర్ఫరాజ్ అహ్మద్: HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ. ప్రభుత్వ కార్యదర్శిగా (మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్) నియామకం. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు.
2. ఈవీ నరసింహారెడ్డి: ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నుంచి HMDA మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ. ముసీ ఎండీగా అదనపు బాధ్యతలు.
3. బి. అజిత్ రెడ్డి: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగింత.
4. మయాంక్ మిట్టల్: శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు.
5. కె. చంద్రకళ: HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియామకం. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు.
6. మనోజ్: బెల్లంపల్లి సబ్ కలెక్టర్ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ.
7. పి. రాము: రాష్ట్ర ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, వరంగల్ నుంచి విద్యాశాఖ ప్రాజెక్టుల స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం.
8. వి. శ్రీనివాస్ రెడ్డి: మాతృశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.

