అనేక మంది వివిధ రకాల చర్మ సమస్యలు, గోకుడు గజ్జి ముఖ్యంగా తీవ్రమైన దురదలు, అలర్జీలతో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు సాధారణంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భరించలేని దురదలకు తక్షణ ఉపశమనం, పరిష్కారం కోసం సహజమైన చిట్కాలు పై ఓ లుక్కేయండి.

Carrot Oil

ఈ రకమైన దురదలన్నింటికీ తక్షణ ఉపశమనం కలిగించే ఒక అద్భుతమైన సహజ చిట్కా క్యారెట్ ఆయిల్ ను వాడితే మంచిది. ఈ నూనె చాలా ఖరీదైనది అయినప్పటికీ, దాని ప్రభావం చాలా శక్తివంతమైనది. యూనివర్సిటీ ఆఫ్ కోయంబ్రాలో జరిగిన పరిశోధనలు క్యారెట్ ఆయిల్ దురదలను తగ్గించడంలో దాని సామర్థ్యాన్ని సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు.

Pacha Karpuram

4 కర్పూరం బిళ్ళలను తీసుకుని పొడిగా చేసుకోవాలి. కర్పూరం చర్మ సమస్యలకు మంచిగా పనిచేస్తుంది. ఇంకా ముఖం పై మొటిమలు, దురద, గోకుడు గజ్జిని, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గజ్జికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

Carrot Oil 1

అధిక బరువు ఉన్నవారిలో తొడల మధ్య, పిరుదుల మధ్య, చంకల మధ్య గాలి సరిగా ఆడకపోవడం వల్ల ఘర్షణ, చెమట చేరి దురదలు వస్తాయి.షేవింగ్ క్రీమ్‌లు, హెయిర్ డైలు, సౌందర్య ఉత్పత్తులు, మేకప్ లోషన్లలోని రసాయనాల వల్ల అలర్జీలు రావచ్చు. ఎగ్జిమా, సోరియాసిస్, తామర వంటి సాధారణ చర్మ వ్యాధులు తీవ్రమైన దురదలకు దారితీస్తాయి. చర్మంలో ఏర్పడే మంటలు దురదకు కారణం కావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాలపై దాడి చేసినప్పుడు కూడా దురదలతో కూడిన చర్మ సమస్యలు వస్తాయి. దోమకాటు వంటివి కూడా తీవ్రమైన దురదలకు దారితీస్తాయి.

Carrot Oil 2

ఈ పరిశోధనల ప్రకారం, క్యారెట్ ఆయిల్‌లో ఉండే ఏబీటీఎస్ (ABTS) అనే రసాయన సమ్మేళనం చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను వేగంగా తొలగిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ తొలగింపు ద్వారా చర్మంలోని మంట (ఇన్ఫ్లమేషన్) త్వరగా తగ్గుతుంది. రకరకాల రసాయనాలతో కూడిన లోషన్లు, ఆయింట్‌మెంట్లకు బదులుగా క్యారెట్ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిదని అంటున్నారు.