వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు !

43
150319brk-ysvivek

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద రెడ్డికి గుండెపోటు రావడంతో..తుదిశ్వాస విడిచారు. వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు.

వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానంద రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 లో రెండుసార్లు ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి 1989, 1994 లో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది..ప్రజలకు సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండలి సభ్యుడిగా పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వివేకానంద రెడ్డి 2011 ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కడప జిల్లాలో లింగాల కాలువను డిజైన్ చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవలందించారు. చాపాడు మండలం మద్దూరులో వివేకానంద రెడ్డి చివరిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిన్న రాత్రి వరకు మద్దూరులో ప్రచారం నిర్వహించారు. మద్దూరు నుంచి నేరుగా పులివెందులకు వెళ్లారు.

అయితే వివేకానంద రెడ్డి మృతిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఆయన నిజంగా గుండెపోటుతో మరణించారా ? లేక వేరే ఏదైనా కారణమా? ఎవరైనా కావాలనే ఆయనను చంపేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో పోలీసులు విచారణ చేపట్టారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here