అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు చేయడం అవసరమా ??

97
Marriage123

ఈకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఎంత మంది ఉన్నారో.. వరకట్నం ఎవరు ఎక్కువిస్తే వాళ్లనే చేసుకుంటాం అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు..అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పెద్ద ఉద్యోగం చేసేవాడు లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాడైతే చాలు కట్నం ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.. పెళ్లిని గ్రాండ్ గా చేయాలి.. బంధువులందరి ముందు రిచ్ గా కనపడాలి అని ఒక్కరోజు పెళ్ళికే లక్షల్లో ఖర్చు పెడతారు.. డబ్బులు ఉంటే పర్లేదు కానీ డబ్బులు లేక అప్పులు చేసి మరీ పెళ్లిని ఘనంగా జరిపించే అవసరం లేదు.. ఎవరో ఏదో అనుకుంటారని లక్షల్లో అప్పులు చేసి పెళ్లిళ్లు చేస్తే ఆ అప్పులు కట్టడానికి జీవితాంతం కష్టపడాలి..అందుకే మన స్థాయికి తగ్గట్టు వేడుక జరుపుకుంటే ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్ ఉండదు..

మంచి స్థాయిలో ఉన్నవారే మ్యారేజ్ ని సింపుల్ గా చేసుకుంటున్నారు.. అందుకు ఉదాహరణ.. అభినవ్,లావణ్యల వివాహం..36 వేల ఖర్చుతో వాళ్ళ పెళ్లి జరిగింది..వాళ్ళు మరీ పేదవాళ్ళు కూడా కాదు..

అభినవ్‌ బెంగళూరులో బ్యాంకు మేనేజర్‌. ఇతని తండ్రి పట్నాల బసంత్‌కుమార్‌ విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌.వధువు లావణ్య ఎంబీబీఎస్‌.ఈమె తండ్రి వెంకటేశ్వర్లు ఉద్యోగి.వీళ్ళు ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ ఉద్యానవనంలో ఒక్కటయ్యారు..

పెళ్లి ఇలా ఎందుకు చేసుకున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం..

అభినవ్ : నేను మొదటి నుంచి ఆధునిక జీవన శైలికి అలవాటు పడలేదు. ఉన్నదాంతో సంతోష పడేవాడిని. ఎందరో గొప్ప వ్యక్తుల ఆదర్శ జీవితాన్ని కళ్లారా చూశాను. నా సోదరి వివాహం గత ఏడాది అతి సాధారణంగానే ఆగ్రాలోని దయాల్‌బాగ్‌ నగర్‌లో రూ.16,100 ఖర్చుతో జరిగింది. ఇప్పుడు వారు సంతోషంగా ఉంటున్నారు. ఈ వివాహం నన్ను బాగా ప్రభావితం చేసింది. రాధాస్వామి సత్సంగ్‌ విధానంలో భాగంగా మా కుటుంబ సభ్యులు ఆచరించిన సాధారణ జీవన విధానమూ ఎంతో నచ్చింది. దీంతో ఇలా ఎటువంటి ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. స్నేహితులకు చెబితే ‘మామా ఇంత సాధారణంగా అవసరమా?’ అన్నారు. తర్వాత వివరిస్తే అంతా సహకరించారు. కొందరు ఢాంబికాలకు పోయి… అతి ఖర్చు చేసి అప్పుల పాలైన వారు గుర్తొచ్చారు. ఆ అప్పులు తీర్చలేక… దాంపత్య జీవితాన్ని సంతోషంగా అనుభవించలేక ఇబ్బంది పడ్డ వారు కళ్లు ముందు మెదిలారు. అతి సాధారణంగా పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని నిర్ణయించుకున్నా. మన నిరాడంబరత పెళ్లి కుమార్తెకు తెలుస్తుంది.తనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఇది జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతో దోహదం చేస్తుంది.

లావణ్య : పెళ్లంటే ఆడపిల్లలకు బోలెడు ఆశలుంటాయి. అయినా అభినవ్‌ చెప్పిన విధానం నాకు నచ్చింది. పెళ్లికి ఆరు నెలల ముందు నుంచే సత్సంగ్‌ అలవాట్లను తెలుసుకోవడం మొదలుపెట్టా. డబ్బు ఖర్చుతో కష్టమే తప్ప మరే ప్రయోజనం లేదని గ్రహించి రూ.36 వేల వివాహ క్రతువుకు ఒప్పుకొన్నా. స్నేహితులు ఈ విషయం తెలిసి నివ్వెరపోయారు. ఏమిటిదని ప్రశ్నించారు. తర్వాత నేను వివరించడంతో ఆనంద పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here