విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్‌?

70
rohit virat

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ..వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ..వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్‌? అని ఎవరైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ అనంతరం హర్భజన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడాడు.అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో టీ20లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరు?అని మీడియా అడగ్గా భజ్జీ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

‘చాలా కష్టమైన ప్రశ్న. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాళ్లు. ఇద్దరూ మ్యాచ్‌ను గెలిపించే వాళ్లే. ఇద్దరూ క్లాస్‌ ప్లేయర్లు. వాళ్లేంటో వారు సాధించిన రికార్డులే చెబుతాయి. రోహిత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు‌. కోహ్లీ కష్టపడే ఆటగాడు. రోహిత్‌లాగా కోహ్లీకి టాలెంట్‌ లేకపోవచ్చు. కానీ అతని హార్డ్‌ వర్క్‌, ఆటపట్ల అతడికున్న అభిరుచే అతడిని నడిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పడం కష్టం. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం నా వల్ల కాదు. ఇద్దరూ ఇండియా కోసమే ఆడుతున్నారు. జట్టుకు విజయానికి ఎంతో కృషి చేస్తున్నారు’ అని సమాధానమిచ్చాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here