మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి?

72
mm2

బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన బాలిక పై వాళ్లింటి సమీపంలో ఉండే సి.భరత్‌ తనని ప్రేమించడం లేదన్న కక్షతో ఆ బాలికపై కొబ్బరి బొండాల కత్తితో బుధవారం దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రాణాపాయ స్థితిలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయంపై హీరో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు..

మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనే వాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తలుచుకుంటే ఇలాంటివి ఏ నాడు జరగవు…ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడు ఐతే ఇంక మనం పుట్టిన దానికి అర్ధం ఏమిటి?? అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు..

Manchu Manoj

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here