విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా విరాట్ కోహ్లీ, స్మృతి మందన్న

48
Kohli-Smriti-696x464

రన్ మెషీన్, ‘కింగ్’ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో తన జట్టు ఘోరపరాజయంతో కృంగిపోయిన భారత సారథి విరాట్ కోహ్లీకి మంచి ఊరట నిచ్చే విషయం ఇది. విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌-2019గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. కోహ్లీ ఖాతాలో వరుసగా మూడో ఏడాది ఈ అవార్డు చేయడం విశేషం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన్నకు కూడా విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా ఎంపికయ్యింది.

విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ… మహిళా జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న యంగ్ సెన్సేషనల్ క్రికెటర్ స్మృతి మందన్న ఎంపికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here