లండన్‌లో ఉన్నా జైల్లో ఉన్నా 100శాతం చెల్లిస్తా

55
vijay-mallya

వ్యాపారవేత్త, విజయ్‌ మాల్యా(63) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జెట్‌ ఎయిర్‌ వేస్‌ సంక్షోభానికి కేంద్రమే కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూసివేత దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పట్ల తన విచారం వ్యక్తంచేశారు. ముఖ్యంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌, నీతా గోయల్‌కు తన సానుభూతిని ప్రకటించారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ గట్టి పోటీ ఇచ్చింది. అంత పెద్ద ప్రయివేటు ఎయిర్‌లైన్‌ను ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమంటూ విజయ్‌ మల్యా బుధవారం ట్వీట్‌ చేశారు.

జెట్‌ పరిస్థితికి రప్రభుత్వమే కారణమంటూ ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. ఒక పక్క ఎయిరిండియాను భారీ ప్యాకేజీ (రూ.35వేల కోట్లు)తో ఆదుకున్న ప్రభుత‍్వం ప్రయివేటు సంస్థలపై మాత్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.

వ్యాపార పరంగా తాము ప్రత్యర్థులమే అయినప్పటికీ జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం ఎంతో కష్టపడ్డ గోయల్‌ దంపతులకు సానుభూతి. వారి సేవలకు నిజంగా దేశం గర్వపడాలి. కానీ దురదృష్టవశాత్తూ దేశీయంగా చాలా ఎయిర్‌లైన్స్‌ దెబ్బతింటున్నాయి. ఎందుకు అని మాల్యా ప్రశ్నించారు.

అలాగే తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నానని, కానీ బ్యాంకులే తీసుకోవడం లేదంటూ మాల్యా మరోసారి ట్విటర్‌ వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. 100శాతం చెల్లిస్తానన్నా నాపై నేర అభియోగాలు వేస్తున్నారు. ఇది ఎయిర్‌లైన్‌ కర్ మఅన్నారు. దీంతోపాటు లండన్‌లో ఉన్నా జైల్లో బ్యాంకులను బకాయిలు చెల్లిస్తానని మరోసారి హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here