కోహ్లీ చేస్తున్నాడని ధోని చేయనవసరం లేదు !

47
ms-dhoni-virat-kohli-1550655059

టీమిండియా క్రికెటర్లు ఏదైనా గాయం భారీన పడినా..కొన్ని నెలల తరవాత జట్టులోకి వచ్చిన మొదట వాళ్లకి యోయో టెస్ట్ చేసి అందులో పాస్ ఐతేనే జట్టులోకి తీసుకుంటారు.. ఇప్పుడు ఐపీఎల్ లో అలాంటిదేమైనా టెస్ట్ ఉందా అంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లకు వరకు మాత్రం యోయో పరీక్ష లేదంట.మిగతా జట్లలో కూడా బహుశా ఉండకపోవచ్చు..చెన్నై ఫ్రాంచైజీకి తొలి సీజన్‌ను నుంచి పని చేస్తున్న టీమిండియా మాజీ ట్రైనర్‌ రాంజీ శ్రీనివాసన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో ప్రారంభమవుతున్న సీజన్‌ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నిర్ధారించేందుకు 2 కి.మీ లేదా 2.4 కి.మీ పరుగు, స్ర్పింట్‌ రిపీట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

అందరిలా యోయో పరీక్ష కాకుండా ఆటగాళ్లను వ్యక్తిగతంగా దృష్టిలో ఉంచుకొని ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాంజీ తెలిపారు. జాతీయ జట్టు నిర్వహిస్తుందని తాము యోయో పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఒకప్పుడు భారత జట్టుకు పనిచేస్తున్నప్పుడూ తాను ఎంఎస్‌ ధోనీకి, సచిన్‌ తెందుల్కర్‌కు వేర్వేరు కసరత్తులు చేయించేవాడినని వెల్లడించారు.

‘విరాట్‌ ఎత్తుతున్న అధిక బరువులకు అతడి శరీరం సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు. అతడు చేస్తున్నాడని మహీ కచ్చితంగా అదే కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఫుట్‌బాల్‌ తరహా ఏరోబిక్‌ క్రీడలకు యోయో సరిపోతుంది. ఫిట్‌నెస్‌ విషయంలో ఒక సమగ్ర దృక్పథం అవసరం. ధోనీ సాధారణంగా క్లీన్‌ అండ్‌ జెర్క్‌ తరహా పవర్‌ లిఫ్టింగ్‌ ఇష్టపడడు. సాధారణంగా ఉండి, అతడి నైపుణ్యాలను పెంచే కసరత్తులు ఎంచుకుంటాడు. ఒక ఆకృతిలో ఉండేందుకు ఉసేన్‌ బోల్ట్‌ స్ప్రింట్‌ చేస్తున్నాడనీ మనమూ అదే అనుసరించాలని లేదుగా. ఒక మనిషి ఆహారం మరో మనిషికి విషం కావొచ్చు కదా!’ అని రాంజీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here