ఆత్మహత్య చేసుకున్న తెలుగు సీరియల్ నటి !

127
suicide-jhanshi

కొంతమంది వాళ్ళ జీవితాల్లో వచ్చే చిన్న చిన్న కష్టాలకు,బాధలకు తట్టుకోలేక తొందరపడి ఆత్మహత్య చేసుకుంటారు.. అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు..వివిధ కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు..ఒక సీరియల్ నటి ప్రేమించి మోసపోయినందుకు హైదరాబాద్ లో సూసైడ్ చేసుకుంది..కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట ఠాణా పరిధిలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో ఉంటుంది.ఆమెకి బ్యూటీ పార్లర్‌ ఉంది. విజయవాడకు చెందిన సూర్య అనే కుటుంబ స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు సోదరుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌ ఇంటికి వచ్చాక తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఝాన్సీ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

suicide-jhanshi (1)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here