వరల్డ్ కప్ జట్టులో వీళ్ళు ముగ్గురు కూడా ఉంటారు !

69
PRASAD-CHAUDHY-IANS

2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జట్టులో ఎవరెవరు ఉంటారన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంది.. 15 మందితో కూడిన జట్టులో ఒక 11 ఆటగాళ్లను మనం ఇప్పుడే ఫిక్స్ చేసుకోవచ్చు.. మిగతా నలుగురు ఎవరుంటారన్నదే ఆసక్తి కలిగేలా చేస్తుంది.. ఈమధ్య టీంఇండియాలో ఆడుతున్న ప్రతీ ఆటగాడు చాలా బాగా ఆడుతున్నాడు.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ ప్రతిభను చూపించుకుంటున్నారు..
ఇక జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ ,శిఖర్ ధావన్ లు ఫిక్స్ .. మూడో ఓపెనర్ గా రహానే లేదా రాహుల్ కి చోటు దక్కే అవకాశం ఉంది..మూడో స్థానంలో కోహ్లీ ఎలాగో ఉన్నాడు.. నాల్గవ స్థానానికి చాలా మంది పోటీ పడుతున్నారు.. అందులో ముఖ్యంగా అంబటి రాయుడు,విజయ్ శంకర్,దినేష్ కార్తీక్,రిషబ్ పంత్ లు ఉన్నారు.. ఈ నాల్గవ స్థానానికి రాహుల్ కూడా పోటీ పడతాడు.. ఇక ఐదవ స్థానం వికెట్ కీపర్ ధోనీదే.. ధోని కాకుండా ఇంకో వికెట్ కీపర్ ఉండాలి కాబట్టి దినేష్ కార్తీక్ లేదా రిషబ్ పంత్ ఉంటారు.. ఇక ఆరవ స్థానంలో కేదార్ జాదవ్ ఉంటాడు..ఏడవ స్థానంలో అల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఫిక్స్.. ఇక ఎనిమిదవ స్థానంలో భువనేశ్వర్ ఫిక్స్.. తర్వాత ఇద్దరు స్పిన్నర్ల ప్లేస్ లో ఎక్కువ శాతం ఆడేది కుల్దీప్ ,చాహల్.. రవీంద్ర జడేజా కూడా జట్టులో ఎంపిక అయ్యే అవకాశం ఉంది.. బుమ్రా 100% ఉంటాడు.. ఇంకో ఎక్స్ట్రా బౌలర్ గా షమీ ఆడే అవకాశం ఉంది..

ఇక టీం లో ఉండటానికి పోటీ పడుతున్న ఆటగాళ్ల లిస్ట్ చూసుకుంటే..
1. విరాట్ కోహ్లీ 2. రోహిత్ శర్మ 3. శిఖర్ ధావన్ 4. అంబటి రాయుడు 5. అజింక్య రహానే 6. విజయ్ శంకర్ 7. ధోని 8. దినేష్ కార్తీక్
9.కేఎల్ రాహుల్ 10. రిషబ్ పంత్ 11. కేదార్ జాదవ్ 12. హార్దిక్ పాండ్య 13.భువనేశ్వర్ 14. బుమ్రా 15. కుల్దీప్ యాదవ్ 16. చాహల్ 17. జడేజా 18. షమీ 19.జడేజా

ఈ 19 ఆటగాళ్ల నుండే వరల్డ్ కప్ లో ఆడబోయే 15 మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది.. ఎవరైనా గాయపడితే తప్ప వేరే వాళ్లకు అవకాశం వచ్చేలా లేదు .. వీళ్ళే కాకుండా సురేష్ రైనా,యువరాజ్ సింగ్,ఉమేష్ యాదవ్,ఖలీల్ అహ్మద్ లు వరల్డ్ కప్ లో ఆడాలని కళలు కంటున్నారు..ఏప్రిల్ 23 లోపు టీం ని సెలెక్ట్ చేయాలి.. అప్పుడే మనకు ఎవరెవరు ఆడుతున్నారనేది తెలుస్తుంది..

ఇక టీం సెలక్షన్ గురించి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ గారు మాట్లాడారు.. మూడో ఓపెనర్ గా రహానే ను తీసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే విజయ్ శంకర్ ఇచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.. రిషబ్ పంత్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు .. వీళ్ళు ముగ్గురు వరల్డ్ కప్ జట్టులో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here