సన్నీలియోన్ కి ధోని అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా ?

52
Sunny-leone-Ms-Dhoni

ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉన్న సన్నీలియోన్..ప్రస్తుతం సినీ స్టార్ గా ఎదిగింది..ఎన్ని అవమానాలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది..అయితే సన్నీకి మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే చాలా ఇష్టమట. ఓ కార్యక్రమంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?’ అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సన్నీ ధోనీ పేరు చెప్పారు. ఎందుకు? అని అడగ్గా.. ధోనీ ఫ్యామిలీ పర్సన్‌ అని ఆయనలో తనకు నచ్చే విషయం అదేనని తెలిపారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటారని పేర్కొంది. కుమార్తె జీవాతో కలిసి దిగే ఫొటోలంటే తనకు చాలా ఇష్టమని, చాలా క్యూట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. చివరిగా ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంతో సన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు టీవీ షోలు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు దక్షిణాది సినిమాలు ఉన్నాయి. హిందీలో నటించబోయే సినిమాకు సన్నీనే నిర్మాతగా వ్యవహరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here