మురగదాస్ తో స్టైలిష్ స్టార్ !

68
Allu Arjun Ar Murugadoss

తమిళ ఫేమస్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేశారు.. చిరంజీవి గారితో స్టాలిన్,మహేష్ బాబుతో స్పైడర్ సినిమాలు చేశారు.. ఇప్పుడు మరో తెలుగు హీరోతో ఆయన నెక్స్ట్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా తీస్తున్న మురగదాస్ ఆ తర్వాత సినిమా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో చేయబోతున్నాడు.. మురగదాస్ బన్నీకి ఒక లైన్ చెప్పినట్లు అది బన్నీకి నచ్చినట్లు తెలిసింది.. ఇప్పుడు పూర్తి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు..ఈ సినిమా గురించి ఆల్రెడీ ప్రకటించినప్పటికీ ఇంకా షూట్ మొదలవ్వలేదు.. సినిమా లాంచ్ కార్యక్రమాలు కూడా జరగలేదు .. బహుశా స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా..త్రివిక్రమ్ బన్నీ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.. దసరాకి ఈ సినిమా రిలీజ్ కానుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here