పుజారాని వన్డేల్లో నాల్గవ స్థానంలో ఆడించాలి !

56
Dkt2TCmX4AEMTgZ

టీమిండియా జట్టులో నాల్గవ స్థానంలో బాటింగ్ చేసే ఆటగాడు చాలా కీలకం..ఈ స్థానం కోసం పోటీ పడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు కానీ అందులో ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిరూపించుకున్నవారు చాలా తక్కువ..ఎప్పుడో ఒకసారి బాగా ఆడుతున్నారు కానీ నిలకడగా రానిచ్చేవారు కరువయ్యారు.. అంబటి రాయుడు,మనీష్ పాండే,కేఎల్ రాహుల్,సురేష్ రైనా,యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఎవరూ కూడా మంచి ఫామ్ లో లేరు..

మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం జట్టులోకి ఎవరెవరిని తీసుకుంటారు.. ముఖ్యంగా నాల్గవ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.. మాజీ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కో పేరును సూచిస్తున్నారు..

లేటెస్ట్ గా సౌరవ్ గంగూలీ టెస్టుల్లో భారత ప్రాధాన బాట్స్మెన్ అయినా పూజారాని వన్డేల్లో నాల్గవ స్థానానికి తీసుకోవాలని సూచించాడు.. ‘నేను చెప్పేది విని చాలా మంది నమ్మరు. కొందరు నా సూచన విని నవ్వుతారు. నా వరకైతే ‘నంబర్‌ 4’కు చెతేశ్వర్‌ పుజారా సరిపోతాడు. ఫీల్డింగ్‌లో అతడు మరీ చురుకు కాదని తెలుసు కానీ మంచి బ్యాట్స్‌మన్‌. నా ప్రతిపాదన విని షాక్‌ అవుతారని తెలుసు. కానీ టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు వన్డే క్రికెట్‌లో పటిష్ఠత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ముఖ్యంగా జట్టులోని టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌కు టన్నుల కొద్దీ పరుగులు చేసే సత్తా ఉన్నప్పుడు అతడు జట్టులో చక్కగా ఇమిడిపోతాడు’ అని గంగూలీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here