“RRR” సినిమా వదులుకోమని వందకోట్ల ఆఫర్ !

15
D1mfoPUUcAAUnfv

రాజమౌళితో సినిమా అంటే ఏ నిర్మాతైనా ఎగిరి గంతేస్తాడు..డబ్బులు..లాభాలు ఎలాగో వస్తాయి కానీ అల్లాంటి దర్శకుడితో ఒక్క సినిమా చేసిన చాలు అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు..అలా రాజమౌళి గారితో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కని ఇప్పుడు ఆ కలని నిజం చేసుకున్నారు డీవీవీ దానయ్య.. జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోలతో మల్టిస్టార్రర్ సినిమా చేసే అవకాశం కూడా ఎవరికీ రాదు.. దానయ్య ఈ సినిమాను 350 నుండి 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఇంతకీ ఐదు రేట్లు ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది.. అయితే ఈ సినిమాను వదులుకుంటే నిర్మాత అయిన దానయ్యకు వంద కోట్లు ఇస్తామని ఎవరో ఆఫర్ చేశారట.. కానీ ఆ ఆఫర్ ని దానయ్య తిరస్కరించినట్లు చెప్పారు.. రాజమౌళి గారితో సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతం దానయ్య తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here