రివ్యూ: సీత‌

60
sita movie

నటీనటులు: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి
దర్శకుడు: తేజ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

కథేంటంటే: సీత (కాజ‌ల్‌)కి డ‌బ్బే లోకం. డ‌బ్బే స‌ర్వస్వం. అందితే కాళ్లు, లేదంటే జుట్టు ప‌ట్టుకునే ర‌కం. రియ‌ల్ ఎస్టేట్ దందాలో వంద కోట్లు పోతున్నాయ‌ని ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూసూద్‌)తో నెల రోజులు స‌హ‌జీవ‌నం చేయ‌డానికి ఒప్పుకొంటుంది. త‌న ప‌ని అయిపోగానే.. బ‌స‌వ‌రాజుకి అందకుండా తిరుగుతుంటుంది. త‌న కోరిక తీర్చుకోవాల‌నుకునే బ‌స‌వ‌రాజు.. సీత‌ని నానార‌కాలుగా ఇబ్బంది పెడుతుంటాడు. బ‌స‌వ‌రాజు వ‌ల్ల సీత అప్పుల్లో కూరుకుపోతుంది. త‌న ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి భూటాన్‌లో ఉన్న అత్త కొడుకు రామ్ (బెల్లంకొండ శ్రీ‌నివాస్‌) ద‌గ్గరకు వెళ్తుంది. రామ్ అమాయ‌కుడు. త‌న‌కు సీతే లోకం. సీత‌కు డ‌బ్బే ప్రాణం. త‌న అవ‌స‌రాల కోసం రామ్‌ని సీత‌ ఎలా వాడుకోవాల‌ని చూసింది? సీత మ‌న‌సులో రామ్ ఎలా స్థానం సంపాదించుకున్నాడు? బ‌స‌వ‌రాజు నుంచి సీత త‌ప్పించుకుందా, లేదా?అనేదే మిగిలిన క‌థ‌.

బ‌లాలు :
కాజ‌ల్‌
నిర్మాణ విలువ‌లు
సోనూసూద్ విల‌నిజం

బ‌ల‌హీన‌త‌లు
క‌థ‌నం

చివ‌రిగా: సీత‌… `రాత` ఇంకాస్త బాగుండాల్సింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here