అమితాబ్ పై పగతో రగిలిపోతున్న షారుక్ ఖాన్ !

51

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై పగ తీర్చుకుంటానని అన్నారు సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌. అమితాబ్‌, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్లా’. సుజాయ్‌ ఘోష్‌ దర్శకుడు..ఈ చిత్ర పోస్టర్‌ను షారుక్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘అమితాబ్‌జీ.. మీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా. సిద్ధంగా ఉండండి’ అని సరదాగా ట్వీట్‌ చేశారు. ఇందుకు అమితాబ్‌ స్పందిస్తూ.. ‘ షారుక్‌ భాయ్‌.. పగ తీర్చుకునే సమయం దాటిపోయింది. ఇప్పుడు అందరికీ పగను పంచాల్సిన సమయం వచ్చింది (పోస్టర్లను ఉద్దేశిస్తూ)’ అని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి ట్విటర్‌ చాట్‌ చూసిన తాప్సి.. ‘షారుక్‌ జీ.. పగ తీర్చుకుంటానని మీరు ఇలా అనడం తప్పు. ఎందుకంటే సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. ఇప్పుడు మీకు సినిమా నుంచి ఏదన్నా కావాలంటే.. ఈ పోస్టర్‌ తీసుకోండి. ఎందుకంటే ఈ పోస్టర్‌లో‌ బచ్చన్‌ సర్‌ చాలా గొప్పగా కనిపిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. పోస్టర్లలో అమితాబ్‌, తాప్సి బాధపడుతున్నట్లుగా కనిపించారు. దానిపై ‘ప్రతిసారీ పగ తీర్చుకోవడం సరైంది కాదు. అలాగని ప్రతిసారీ క్షమించడం కూడా సరికాదు’ అని రాసున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 2016లో వచ్చిన ‘కాంట్రాటీయెంపో’ అనే స్పానిష్‌ థ్రిల్లర్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. గతంలో ‘పింక్‌’ సినిమాలో అమితాబ్‌, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించారు.

badla1badla2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here