సమంత దూకుడు..సాటెవ్వరూ ??

54
samannataa

క్యూట్ హీరోయిన్ సమంతకు పెళ్లి తర్వాత కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి.. వరుసబెట్టి సినిమాలు చేసేస్తుంది.. ప్రస్తుతం సమంత తన భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన “మజిలీ” సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.. తెలుగే కాకుండా తమిళ్ లో కూడా సమంత సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి.. అలాగే మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో “ఓ బేబీ” అనే సినిమాను చేస్తుంది..ఈ సినిమాకు సంభందించిన ఒక సాంగ్ పోస్టర్ ను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు..

‘నా మార్గాన్ని ఎంచుకోవడానికి ఆ దేవుడు, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో సహకరించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వృద్ధి చెందడానికి కొంచెం సమయం తీసుకున్నా. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా. ఇవాళ నా వృద్ధిలోని సంతృప్తిని ఆస్వాదిస్తున్నా. ‘ఓ బేబీ’ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నా. ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకం కాబోతోంది. నా ప్రియమైన దర్శకురాలు నందిని రెడ్డి నాకు ఎంతో ఇష్టమైన పాత్రను ఇచ్చారు’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు.

ఇవే కాకుండా సమంత 96 సినిమా తెలుగు రీమేక్ లో శర్వానంద్ తో కలిసి నటించబోతుంది.. ఏ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here