క్యారెక్టర్లు తెలిసినవే కథే తెలియనిది !

58
D1mWG_kUYAEFELM

అల్లూరి సీత రామరాజు,కొమురం భీం ల వీరత్వం..వాళ్ళ పోరాటం గురించి చాలా పుస్తకాల్లో మనం చదువుకున్నాం..కానీ పూర్తిగా కాదు.. వాళ్ళు ఫైటర్స్ కాకముందు ఎలా ఉండేవారో.. వాళ్ళు ఇలా పోరాట యోధులుగా మారిన విధానం ఏంటో అనేది ఎవరికీ తెలియదు..ఈ లైన్ నే తీసుకుని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్లాన్ చేసాడు..మనకి తెలిసిన ఇద్దరు గొప్ప పోరాట యోధుల పాత్రల్ని తీసుకుని తనదైన శైలిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా..సీత రామ రాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.. వీళ్ళ వేషధారణ కూడా మనకు ఇదివరకు తెలిసినట్టు ఉండకపోవచ్చు..కంప్లీట్ గా ఇది రాజమౌళి ఊహాల నుండి తెరపైకి తీసుకరాబోతున్న ఇద్దరి పోరాట యోధుల సినిమా..ఇద్దరు తెలుగు వీరుల గురించి దేశం మొత్తానికి..చేరగలిగితే ప్రపంచానికి తెలియజేయడానికి ఈ సినిమా దోహదపడుతుంది..అలాగే తెలుగు సినిమా మార్కెట్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది..ఇక ఈ సినిమాను పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు..బాహుబలి2 సినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేసే అవకాశం ఈ సినిమాకే ఉంది.. ఇక సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందనేది తెలియాలంటే ఇంకా సంవత్సరం ఆగాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here