RRR ప్రెస్ మీట్ పూర్తి వివరాలు !

51
D1mRTPNUkAEaupO

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్..ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి వివరాలు తెలియజేయటానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు..అన్ని భాషల్లో ఈ సినిమా RRR అనే టైటిల్ తోనే రిలీజ్ అవుతుందని..ఎన్టీఆర్ కొమురం భీం గా..రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నారు.. ఈ సినిమాను పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు..వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.. అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తుంది..డైసీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తుంది..ఇందులో అజయ్ దేవగన్ మరియు సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..స్వాతంత్య్రం వచ్చిన కాలానికంటే ముందు అంటే 1920 లో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది తారక్ నాకు సోదరుడిలాగా..తను నా డార్లింగ్ అని రామ్ చరణ్ అన్నారు.. నేను తారక్ రాజమౌళి గారితో ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని రామ్ చరణ్ అన్నారు.. అలాగే జీవితాంతం మేము ఇలాగే స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అన్నారు..ఇప్పటివరకు చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమాకే తారక్ ఎక్కువ కష్టపడ్డానని చెప్పారు.. ఈ సినిమాకి 300 నుండి 400 కోట్ల ఖర్చు అవుతుందని ఈ సినిమా డీవీవీ దానయ్య గారు చెప్పారు.. భారీ బడ్జెట్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో రాబోతున్న సినిమా RRR.. రాజమౌళి తో సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని దానయ్య చెప్పారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లను స్టార్లుగా కాకుండా ఓ రెండు పాత్రల్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాం.. ఎవరు ఎంతసేపు స్క్రీన్ పైన కనిపిస్తారనే విషయాన్ని పక్కన పెడితే స్టోరీ సమతూకంగా ఉంటుందని రాజమౌళి అన్నారు.. ప్రెస్‌మీట్‌కు తారక్‌, రామ్‌చరణ్‌ కొత్త తరహా మీసకట్టుతో హాజరయ్యారు. ఇద్దరూ ఒకేరకమైన మీసం కట్టుతో రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది.

D1mSeblUkAAfHto

D1mXC0uXgAAGH_N

దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రెస్‌ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా నమ్మకం ఏంటంటే.. ప్రేక్షకులు సినిమాకు వచ్చే ముందు సినిమా ఎలా ఉండబోతోంది అన్న అంచనాలు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని నేను నమ్ముతాను. అందుకే నేను ప్రేక్షకులకు ముందే సినిమా గురించి చెప్పడానికి ఇష్టపడతా..1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లమే కాకుండా వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.

D1mXmrbUYAATreSD1mXmrVVYAIEgvT

D1mXmrVVYAENtie

1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక చదువకుని వచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది అని రాజమౌళి వివరించారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here