ఆస్ట్రేలియా సిరీస్ కి రోహిత్ దూరం !

69
DycmuA7U8AAMMaJ

టీమిండియా సెలెక్టర్లు వరల్డ్ కప్ ఆడే జట్టు ఎంపిక కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు.. భారత జట్టులో ప్రతిభావంతులకు కొదువ లేదు.. అయితే వరల్డ్ కప్ లో ఆడేది 15 మంది మాత్రమే కాబట్టి ఆటగాళ్ల మధ్య చాలా పోటీ ఉంది.. కొన్ని స్థానాల్లో కొంతమంది ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కానీ కొన్ని స్థానాల్లో ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.. ఇక వరల్డ్ కప్ కంటే ముందు ఉన్నదీ ఈ ఒక్క సిరీస్ కాబట్టి ఈ సిరీస్ లో కొంతమందిని పరీక్షించాలనుకుంటుంది జట్టు మానేజ్మెంట్.. న్యూజిలాండ్ సిరీస్ నుండి కోహ్లీకి,బుమ్రా కి విశ్రాంతినిచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళను తీసుకుని.. రోహిత్ శర్మ,భువనేశ్వర్,షమీ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనుకుంటున్నారు.. అజింక్య రహానే,కే ఎల్ రాహుల్,విజయ్ శంకర్,రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను పరీక్షించాలనుకుంటున్నారు.. అందుకే ఈ సిరీస్ లో ఎక్కువ మంది ప్లేయర్లను ఆడించాలని భారత్ చూస్తుంది.. వాళ్ళ ఫిట్ నెస్ మరియు ఫామ్ ని బట్టి ఆటగాళ్లను వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తారు.. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ కూడా జరగనుంది.. అప్పుడు ఎవరికీ రెస్ట్ దొరకదు.. అందరూ ఆటగాళ్లు ఆడక తప్పదు.. అందుకే ఇప్పుడు కొంతమంది ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here