అసిస్టెంట్ కోచ్‌గా రికీ పాంటింగ్‌ !

53
ponting

చాలా రోజులు నుండి ఆస్ట్రేలియా టీమ్ సరిగా ఆడట్లేదు..ఇప్పటికే చాలా మ్యాచుల్లో ఓడిపోయింది.. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌కు ముందు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మూడుసార్లు వరల్డ్‌కప్ గెలిచిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ప్రస్తుత కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి అతడు పని చేయనున్నాడు. కెరీర్‌లో మొత్తం ఐదు వరల్డ్‌కప్‌లు ఆడిన‌ పాంటింగ్.. మూడు గెలిచాడు. అందులో రెండింట్లో అతడే కెప్టెన్. అంతటి అనుభవం ఉన్న ప్లేయర్‌ను ఆసీస్ రంగంలోకి దించింది. ఆస్ట్రేలియా వన్డే టీమ్ బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్‌లో మెళకువలు నేర్పించనున్నాడు పాంటింగ్. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న గ్రేమ్ హిక్ టీమ్‌ను యాషెస్ సిరీస్‌కు సిద్ధం చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here