వైఎస్సార్ పై వర్మ తీయబోతున్న సినిమా ఎవరి కొంప ముంచుతుందో ??

40
rgv

సంచలన దర్శకుడు..కొంతమందికి మెంటలోడిలా కనిపించే రామ్ గోపాల్ వర్మ.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనందరికీ తెలిసిందే..అయితే ఈ సినిమా లెజెండరీ సినీ నటుడు,ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారి జీవితం యొక్క చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు.. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నుండి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను చూపెట్టడమే ఈ సినిమా ఉద్దేశం.. అలాగే జనాలకు తెలియని కొన్ని నిజాలను ఈ సినిమాలో వర్మ చూపెట్టబోతున్నాడు..

ఇక ఈ సినిమానే కాకుండా రామ్ గోపాల్ వర్మ మరికొంతమంది ప్రముఖుల జీవితాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.. కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే ఏ పాల్ లాంటి వారిపై కూడా ఆయన సినిమాలు తీయనున్నారట.. వైఎస్సార్ మరణం వెనక ఏదైనా కుట్ర జరిగిందా ? ఆరోజు ఆ హెలికాఫ్టర్ ప్రమాదం ప్లాన్ ప్రకారమే జరిగిందా అనే విషయాలను ఆర్జీవి తన సినిమాలో చూపించబోతున్నాడు.. ఈ సినిమాలతో వర్మ మళ్ళీ ఎలాంటి వివాదాలకు కారణమవుతాడో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here