రోహిత్ శర్మ రికార్డులు !

53
ro45

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ కొన్నిరికార్డులు క్రియేట్ చేసాడు.టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 92 మ్యాచుల్లో 32.68 సగటుతో 2,288 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.. కివీస్‌ మ్యాచ్‌లో అర్ధశతకంతో చెలరేగిన రోహిత్‌ ఆ జట్టు సీనియర్‌‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (2,272)ను వెనక్కి నెట్టాడు. షోయబ్‌ మాలిక్‌ (2,263), విరాట్‌ కోహ్లీ (2,167), మెక్‌కలమ్‌ (2,140) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2,000 పరుగుల జాబితాలో విరాట్‌ కోహ్లీ మాత్రమే 49.25 సగటుతో ఉన్నాడు.

కివీస్‌ మ్యాచ్‌లోనే రోహిత్‌ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 20 వరకు 50+ స్కోర్లు సాధించాడు. ఈ రికార్డును చెరిపేందుకు విరాట్‌ కోహ్లీ రెడీగా ఉన్నాడు. అతడు 19 అర్ధశతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ సిక్సర్ల సంఖ్య 102కు చేరింది. క్రిస్‌గేల్‌ (103), మార్టిన్‌ గప్తిల్‌ (103) అతడి కన్నా ముందున్నారు. తర్వాత జరిగే మ్యాచ్ లో దాదాపుగా వీళ్ళను దాటేసి మరో రికార్డు క్రియేట్ చేస్తాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here