నితిన్ కు జోడి గ రష్మిక మందన్న

76
Bheeshma

యంగ్ హీరో నితిన్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్తలపై దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చారు. భీష్మలో ఒకే హీరోయిన్‌ఉంటుందని ఆ పాత్ర రష్మికను ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here