రకుల్ కొత్త పాట చూసారా …!

42
rakul

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘దే దే ప్యార్‌ దే’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు కథానాయికలు. ఇందులో అజయ్‌ ప్రియురాలిగా రకుల్‌, ఆయన మాజీ భార్యగా టబు నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలోని పాటను తాజాగా విడుదల చేశారు. ‘వడ్డీ షరాబన్‌..’ అని సాగే ఈ పాటలో రకుల్‌ స్టెప్పులేస్తూ, సందడి చేశారు. ఓ పెళ్లిలో ఆమె చిందేస్తూ కనిపించారు. ఎంతో హుషారు సాగిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే 9 లక్షల మందికిపైగా యూట్యూబ్‌లో వీక్షించడం విశేషం. సునిధీ చౌహాన్‌, నవ్‌రాజ్‌ హన్స్‌ ఈ పాటను ఆలపించారు. విపిన్‌ పట్వా సంగీతం అందించారు.‘‘వడ్డీ షరాబన్‌..’ షూటింగ్‌ ఎంతో సరదాగా జరిగింది.. ఇది ఓ గొప్ప అనుభవం. ఇంత చక్కటి పాటను నాకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని రకుల్‌ ట్వీట్‌ చేశారు. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మించింది. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here