డిసెంబరు నాటికి RRR షూటింగ్ కంప్లీట్ !

56
RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ 2019 డిసెంబర్ నాటికి అయిపోతుందంట.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుని 2020 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.. అక్కడ ఉన్న సెట్ చూస్తే ఈ సినిమా 1947 కంటే ముందు జరిగిన కథ అని అర్థం అవుతుంది.. లీక్ అయిన ఫొటోల్లో బ్రిటిష్ ఫ్లాగ్ కనిపించింది.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారన్నది ఇంకా తెలియలేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కొన్ని ఫైట్స్ షూట్ చేస్తున్నారు.. ఈ సినిమాకు హీరోయిన్స్ ని ఇంకా ఫైనల్ చేయలేదు.. బాలీవుడ్ స్టార్ అలియా భట్ మరియు ఒక బ్రిటిష్ గర్ల్ ఇందులో నటించనున్నారని వార్తలొచ్చాయి.. మార్చిలో రామ్ చరణ్ బర్త్ డే ఉంది.. అప్పుడు టైటిల్ కానీ రామ్ చరణ్ లుక్ కానీ విడుదల చేసే అవకాశం ఉంది.. అలాగే మే లో ఎన్టీఆర్ బర్త్ డే ఉంది.. అప్పుడు కూడా ఈ సినిమా గురించి అప్డేట్ లు వచ్చే అవకాశం ఉంది.. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.. సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ చూసుకుంటున్నారు.. డీవీవీ బ్యానర్ పై డీవీవీ దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టార్రర్ గా రాబోతున్న ఈ సినిమా హిందీ,తమిళ్ ఇంకా మిగతా భాషల్లో కూడా రిలీజ్ అవ్వనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here