ప‌బ్‌జీ బ్యాన్‌ చేసిన నేపాల్ ప్రభుత్వం

38
pubgloadingscreen

నేపాల్ : పబ్‌జీ గేమ్‌పై నేపాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్‌లోని ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లకు, మొబైల్ ఆప‌రేట‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లకు ప‌బ్‌జీ గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాల‌ని నేపాల్ టెలిక‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఈ గేమ్‌ను గుజరాత్‌లో కూడా బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. యూఏఈలో కూడా ఈ గేమ్‌పై నిషేధం విధించడానికి చర్చలు జరుగుతున్నాయి.

నేపాల్‌ ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ నుంచి అందిన సమాచారంతో ఈ గేమ్‌పై నిషేధం విధించినట్టు ఎన్‌టీఏ డిప్యూటీ డైరెక్టర్‌ సందీప్ తెలిపారు.చిన్నారులు, యువత ఈ గేమ్‌కు బానిసలుగా మారిపోతున్నారని చెప్పారు. దీంతో పిల్లలు చదువులకు ఈ గేమ్‌ ఆటంకంగా మారిందని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here