ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌

43

హైదరాబాద్: యంగ్‌ రెబెల్‌ స్టార్ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. అయితే తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్‌ పెట్టలేదు కూడా. కేవలం ఖాతాకు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నారు. ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది. బహుశా ఆయన నటిస్తున్న ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను తొలి ఫొటోగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తారని తెలుస్తోంది. ఖాతా ఇంకా అధికారికం కాలేదు.

prabhas02

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here